Vemana padyalu telugulo 71-85

Read vemana satakam telugu padyam – 71

Mrugamadambu chooda meeda nallaganundu, baridavillu daani paramalambu, guruvulaina vaari gunamu leelaaguraa, Vishwadabhirama! Vinuravema!

మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు, బరిఢవిల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణము లీలాగురా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 72

Nera nannavaadu nerajaana mahilona, nertunanna vaadu ninda jendu, oorukunna vaade yuttamayogiraa, Vishwadabhirama! Vinuravema!

నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన, నేర్తునన్న వాఁడు నింద జెందు, ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 73

Ganga paaru nepudu kadalani gatitoda, muriki vaagu paaru mrotatoda, pedda pinnatanamu perimi ilaagu, Vishwadabhirama! Vinuravema!

గంగ పాఱు నెపుడు కదలని గతితోడ, ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ, పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 74

Paamu kanna ledu paapishti jeevambu, atti paamu cheppinatlu vinunu, khaluni gunamu maanpu ghanulevvarunu leru, Vishwadabhirama! Vinuravema!

పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్లు వినును, ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 75

Annidaanamulanu nannadaaname goppa, kannatallikante ghanamuledu, enna gurunikanna nekkuduledayyaa, Vishwadabhirama! Vinuravema!

అన్నిదానములను నన్నదానమె గొప్ప, కన్నతల్లికంటె ఘనములేదు, ఎన్న గురునికన్న నెక్కుడులేదయా, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 76

Goddutaavu bituka gunda gompoyina, bandla nooda dannu paalaneedu, lobhivaani naduga laabhambu ledayaa, Vishwadabhirama! Vinuravema!

గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన, బండ్ల నూడ దన్ను పాల నీదు, లోభివాని నడుగ లాభంబు లేదయా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 77

Emi gonchuvacche nemitaa gonipovy, buttuvela narudu gittuvela, dhanamu lechatikegu, Vishwadabhirama! Vinuravema!

ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ, బుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనము లెచటికేగు దానెచ్చటికినేగు, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 78

Kulamu galuguvaadu gotrambu galavaadu, vidyacheta virraveeguvaadu, pasidi galuguvaani baanisa kodukulu, Vishwadabhirama! Vinuravema!

కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు, విద్యచేత విఱ్ఱవీగువాఁడు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 79

Kaniyu gaanaledu kakalimpadaa noru, viniyu vinagaledu vismayamuna, sampada galavaani sannipaatambidi, Vishwadabhirama! Vinuravema!

కనియు గానలేఁడు కదలింపఁడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 80

Pandipilla leenu padiyunaidintini, kunjarambu leenu kodama nokati, yuttama purushundu yokkadu chaaladaa, Vishwadabhirama! Vinuravema!

పందిపిల్ల లీను పదియు నైదింటిని, కుంజరంబు లీను కొదమ నొకటి, యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 81

Paranaari sodarudai, paradhanamula kaasapadaka, parahitachaarai, paru laligina taa nalagaka, parulennaga bratukuvaadu, Vishwadabhirama! Vinuravema!

పరనారీ సోదరుడై, పరధనముల కాసపడక! పరహితచారై, పరు లలిగిన తా నలగక, పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!

Read vemana satakam telugu padyam – 82

Neechagunamulella nirmoolamaipovu, koduvaledu sujana goshti valana, gandha malada menikampadaginayatlu, Vishwadabhirama! Vinuravema!

నీచగుణములెల్ల నిర్మూలమైపోవు, కొదవలేదు సుజన గోష్ఠి వలన, గంధ మలద మేనికంపడగినయట్లు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 83

Marmameruga leka matamulu kalpinchi, yurvijanulu dukha monduchundru, gaajutinti kukka kalavalapadureeti, Vishwadabhirama! Vinuravema!

మర్మమెఱుగ లేక మతములు కల్పించి, యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు, గాజుటింటి కుక్క కళవళపడురీతి, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 84

Pani todavulu veru bangaramokkati, paraga ghatalu veru pranamulokkati, araya tindlu veru aakali yokkati, Vishwadabhirama! Vinuravema!

పని తొడవులు వేరు బంగారమొక్కటి, పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి, అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 85

Kunda kumbha mandru konda parvata mandru, yuppu lavana mandru yokati gaade? bhashalinte veru paratatvemokate, Vishwadabhirama! Vinuravema!

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు, యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?, భాషలింతె వేఱు పరతత్వమొకటే, విశ్వదాభిరామ! వినుర వేమ!

Vemana padyalu telugulo 61-70

Read vemana satakam telugu padyam – 61

Tanuvuloni yaatma tatva merugaka, vere kaladatanchu veduka depudu, bhanudunda divve pattuka vedukunaa, Vishwadabhirama! Vinuravema!

తనువులోని యాత్మ తత్వ మెఱుంగక, వేరె కలడటంచు వెదుక డెపుడు, భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 62

Kaanivaani chetagaanu veesambichchi, ventadiruguvaade verrivaadu, pilli tinna kodi pilichina palukunaa, Vishwadabhirama! Vinuravema!

కానివాని చేతఁగాసు వీసంబిచ్చి, వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 63

Viduva muduva leka kuduvagattagaleka, verapuleka vidyavidhamu leka, vedalalenivaani nadapeenu ganaroko, Vishwadabhirama! Vinuravema!

విడువ ముడువ లేక కుడువగట్టగలేక, వెరపులేక విద్యవిధము లేక, వెడలలేనివాని నడపీను గనరొకో, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 64

Maatalaada nerchi manasu ranjila jesi, paraga priyamu jepi badalakunna, nokari cheti sommulooraka vacchunaa, Vishwadabhirama! Vinuravema!

మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి, పరగ ప్రియము జెప్పి బడలకున్న, నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 65

Tanakugalgu pekku tappulu nundagaa, ogu nera menchu norulagaanchi, chakkilambugaanchi jantika naginatlu, Vishwadabhirama! Vinuravema!

తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా, ఓగు నేర మెంచు నొరులఁగాంచి, చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 66

Mailkoka toda maasina talatoda, odalu muruki toda nundeneni, agrakulajadaina lattittu pilvaru, Vishwadabhirama! Vinuravema!

మైలకోక తోడ మాసిన తలతోడ, ఒడలు ముఱికి తోడ నుండెనేని, అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 67

Kalla nijamella garakantu derugunu, neeru pallamerugu nijamugaanu, tallitaanerugu tanayuni janmambu, Vishwadabhirama! Vinuravema!

కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును, నీరు పల్లమెరుగు నిజముగాను, తల్లితానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 68

Oruni cherachadamani yallamamdenturu, tamakucheterugani dharani narulu, tammu jeruchuvaadu devudu ledoko Vishwadabhirama! Vinuravema!

ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు, తమకుచే టెరుగని ధరణి నరులు, తమ్ము జెఱచువాడు దేవుడు లేడొకో, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 69

Alanu buggaputtinappude kshayamounu, galanu gaanchu lakshmiganutaledu, ilanu bhogabhaagyameeteeru gaadoko, Vishwadabhirama! Vinuravema!

అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను, గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు, ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 70

Erukleni dorala nennallu golichina, bratukaledu vatti bhrantikaani, goddutaavu paalu gorite chepunaa, Vishwadabhirama! Vinuravema!

ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Vemana padyalu telugulo 51-60

Read vemana satakam telugu padyam – 51

Maatalaada nerchi manasu ranjilajesi, paragabriyamu cheppi badalakunna, nokaricheti sommu looraka vacchunaa, Vishwadabhirama! Vinuravema!

మాటలాడ నేర్చి మనసు రంజిలజేసి, పరగఁబ్రియము చెప్పి బడలకున్న, నొకరిచేతి సొమ్ము లూరక వచ్చునా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 52

Chikkiyunnavela simhambunainanu, bakkakukkarachi baadha cheyu, balimi leni velabatambu chelladu, Vishwadabhirama! Vinuravema!

చిక్కియున్నవేళ సింహంబునైనను, బక్కకుక్కకఱచి బాధ చేయు, బలిమి లేని వేళఁబంతంబు చెల్లదు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 53

Chippabadda swatichinuku mutyambaaye, neetibadda chinuku neetagalise, braaptigalgu chota phalamela tappuraa, Vishwadabhirama! Vinuravema!

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె, నీటిబడ్డ చినుకు నీటఁగలిసె, బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 54

Magani kaalamandu maguva kashtinchina, sutula kaalamandu sukhamunandu, kalimi lemi rendu gala ventavaariki, Vishwadabhirama! Vinuravema!

మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమందు సుఖమునందు, కలిమి లేమి రెండు గల వెంతవారికి, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 55

Unnaghanatabatti manninture kaani, pinna, peddatanamu nennaboru, vaasudevu vidichi vasudevu nenturaa, Vishwadabhirama! Vinuravema!

ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని, పిన్న, పెద్దతనము నెన్నబోరు, వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 56

Karma madhikamaina gadachi povagaradu, dharmaraju dechchi tagani chota, gankubhattu jesegata daivambu, Vishwadabhirama! Vinuravema!

కర్మ మధికమైన గడచి పోవగరాదు, ధర్మరాజు దెచ్చి తగని చోట, గంకుభట్టుఁజేసెఁగటకటా దైవంబు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 57

Heenudenni vidyalila nabhyasinchina, ghanudugaadu, morakujanudegaani, parimalamulu gardhabhamu moya ghanamoune, Vishwadabhirama! Vinuravema!

హీను డెన్ని విద్య లిల నభ్యసించిన, ఘనుడుగాడు మొఱకు జనుడెగాని, పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 58

Ennichotla tirigi ye paatlu padinanu, antaniyyaka shani ventadirugu, bhoomi krottalaina bhuktulu krottalaa, Vishwadabhirama! Vinuravema!

ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను, అంటనియ్యక శని వెంటఁదిరుగు, భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 59

Ichchuvaani yodda neeyanivaadunna, jachchugaani eevi saganeedu, kalpataruvu krinda gaccha podunnatlu, Vishwadabhirama! Vinuravema!

ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న, జచ్చుగాని యీవి సాగనీఁడు, కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 60

Kalusha maanasulaku gaanpimpagaaraadu, adusulona bhanudadaginattu, tetaneeru punyadehamatlunduraa, Vishwadabhirama! Vinuravema!

కలుష మానసులకు గాన్పింపగారాదు, అడుసులోన భానుడడగినట్టు, తేటనీరు పుణ్యదేహమట్లుండురా?, విశ్వదాభిరామ! వినుర వేమ!

Vemana padyalu telugulo 41-50

Read vemana satakam telugu padyam – 41

Aashacheta manuju laayuvu galanaallu, tiruguchundru bhramanu drippaleka, muriki bhaandamandu musugu neegala bhangi, Vishwadabhirama! Vinuravema!

ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు, తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక, మురికి భాండమందు ముసుగు నీగల భంగి, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 42

Tanuva devari sommu tanadani poshinchi, dravya mevarisommu daachukonanga, praanamevari sommu paaripovaka nilva, Vishwadabhirama! Vinuravema!

తనువ దెవరి సొమ్ము తనదని పోషించి, ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ, ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 43

Chachchipadina pashuvu charmambu kandalu, patti puriki tinunu paraga gradda, gradda vantivaadu jagapati kaadoko, Vishwadabhirama! Vinuravema!

చచ్చిపడిన పశువు చర్మంబు కండలు, పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద, గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 44

Aidu vellu balimi hastambu panicheyu, nandokandu vidda pondu chedunu, sweeyadokadu vidina jedu kadaa pani balmi, Vishwadabhirama! Vinuravema!

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు, నం దొకండు విడ్డ పొందు చెడును, స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 45

Poorva janmamandu punyambu cheyani, paapi taa dhanambu badayaledu, vittamarachi koya vedikina chadambu, Vishwadabhirama! Vinuravema!

పూర్వ జన్మమందు పుణ్యంబు చేయని, పాపి తా ధనంబు బడయలేడు, విత్తమరచి కోయ వెదకిన చందంబు, విశ్వదాభిరామ… వినుర వేమా..!

Read vemana satakam telugu padyam – 46

Kallalaaduvaani gramakarta yaragu, satyamaduvaani swaamy yaragu, bekkutindabotu bendlamerunguraa, Vishwadabhirama! Vinuravema!

కల్లలాడువాని గ్రామకర్త యరుగు, సత్యమాడువాని స్వామి యరుగు, బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 47

Bhoomi naadi yanina bhoomi phakkuna navvu, daana heenu joochi dhanamu navvu, kadana bheetu joochi kaaludu navvu, Vishwadabhirama! Vinuravema!

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు, దాన హీనుఁ జూచి ధనము నవ్వు, కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 48

Vana raakadayunu braanaambu pokada, kaanabada dadenta ghanunikaina, kaanapadina meeda kaliyetlu nadachuraa, Vishwadabhirama! Vinuravema!

వాన రాకడయును బ్రాణాంబు పోకడ, కానబడ దదెంత ఘనునికైన, కానపడిన మీద కలియెట్లు నడచురా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 49

Vaana guriyakunna vacchunu kshaamambu, vaana guriseneni varadapaaru, varada karavu rendu valasato nerugudee, Vishwadabhirama! Vinuravema!

వాన గురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరదపారు, వరద కరవు రెండు వలసతో నెరుగుడీ, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 50

Aalimaatalu vini annadammulabaasi, vere povuvaadu verrivadu, kukkatokabatti godavareedunaa, Vishwadabhirama! Vinuravema!

ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి, వేఱె పొవువాడు వెఱ్రివాడు, కుక్క తోకబట్టి గోదావ రీదునా, విశ్వదాభిరామ! వినురవేమ!

Vemana padyalu telugulo 31-40

Read vemana satakam telugu padyam – 31

Vidyalenivaadu vidvamsu cheruva nundagaane panditundu gaadu, kolani hamsalakada gokkeralunnatlu, Vishwadabhirama! Vinuravema!

విద్యలేనివాడు విద్వాంసు చేరువ, నుండగానె పండితుండు గాడు, కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 32

Nindunadulu paaru nilachi gambheeramai, verrivaagu paaru vegaborli, alpudaadureeti nadhikundu naadunaa, Vishwadabhirama! Vinuravema!

నిండునదులు పారు నిలచి గంభీరమై, వెఱ్రివాగు పాఱు వేగబొర్లి, అల్పుడాడురీతి నధికుండు నాడునా, విశ్వదాభిరామ వినురవేమ

Read vemana satakam telugu padyam – 33

Priyamuleni vindu pindi vantala chetu, bhaktileni pooja patri chetu, paatramerugani eevi bangaru cheturaa, Vishwadabhirama! Vinuravema!

ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తిలేని పూజ పత్రి చేటు, పాత్రమెరుగని ఈవి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినుర వేమ..!

Read vemana satakam telugu padyam – 34

Poojakanna nencha buddi nidanambu, maatakanna nencha manasu dhrudhamu, kulamukanna migula gunamu pradhanambu, Vishwadabhirama! Vinuravema!

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు, మాటకన్న నెంచ మనసు దృఢము, కులముకన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 35

Kaanivanitoda galasi meluguchunna, gaanivaanigaane kaantu ravani, taati krinda paalu draagina chandamou, Vishwadabhirama! Vinuravema!

కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ, గానివానిగానె కాంతు రవని, తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 36

Alpajaati vaani kadhikaaramichchina, doddavaarinella tolagagottu, cheppu tinedu kukka cheraku teeperugunaa, Vishwadabhirama! Vinuravema!

అల్పజాతి వాని కథికార మిచ్చిన, దొడ్డవారినెల్ల తొలగగొట్టు, చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా? విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 37

Neellameeda noda nigidi tinnagabraaku, bayata mooredaina baaraledu, nelavu tappu chota nerpari koragadu, Vishwadabhirama! Vinuravema!

నీళ్లమీద నోడ నిగిడి తిన్నగబ్రాకు, బయట మూరెడైన బారలేదు, నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 38

Neellaloni chepa neri maamsa maashaku, gaalamandu chikki goolinatlu, aasha butti manuju daariti chedepovu, Vishwadabhirama! Vinuravema!

నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు, గాల మందు చిక్కి గూలినట్లు, ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 39

Chaduvujaduvukunna soukhyambulunulevu, chaduvujadivineni sarasudagunu, chaduvumarmamerigi chaduvangachudumu, Vishwadabhirama! Vinuravema!

చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు, చదువుజదివెనేని సరసుడగును, చదువుమర్మమెరిగి చదువంగచూడుము, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 39

Bahula kaavyamulanu barikimpagaavacchu, bahula shabda chayamu balakavacchu, sahana mokkatabbajaala kashtamburaa, Vishwadabhirama! Vinuravema!

బహుళ కావ్యములను బరికింపగావచ్చు, బహుళ శబ్ద చయము బలకవచ్చు, సహన మొక్కతబ్బజాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ

Vemana padyalu telugulo 21-30

Read vemana satakam telugu padyam – 21

Pattupattaraadu patti viduvaraadu, patteneni bigiya battavalayu, batti viduchukanna baraga jachchutamelu, Vishwadabhirama! Vinuravema!

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు, పట్టేనేని బిగియ బట్టవలయు, బట్టివిడుచుకన్న బరగ జచ్చుటమేలు, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 22

Vudadhilona neellu vuppaluga jese, pasidi galugu vaani pipina jese, brahmadevi seta padaina setara, Vishwadabhirama! Vinuravema!

ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె, పసిడి గలుగు వాని పిపిన జేసె, బ్రహ్మదేవు సేత పదడైన సేతరా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 23

Pasula vanne veru palella okkati, pushpajaati veru pooja okati, darshanambulaaru daivambu okkati, Vishwadabhirama! Vinuravema!

పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ

Read vemana satakam telugu padyam – 24

Jeevijamputella shivabhakti tappute, jeevinarasi kanudu shivude yagunu, jeevudi shivudanu siddambu teliyaraa, Vishwadabhirama! Vinuravema!

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే, జీవునరసి కనుడు శివుడె యగును, జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 25

Yeruga vaani delupa nevvadainanu jaalu, norula vashamugaadu ogudelpa, yetivanka deerpa nevvari taramayaa, Vishwadabhirama! Vinuravema!

ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు, నొరుల వశముగాదు ఓగుదెల్ప, యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 26

Neellalona mosali nigidi yenugu deeyu, bayata kukkacheta bhangapadunu, sthanabalimigaani tanabalimi kaadayaa, Vishwadabhirama! Vinuravema!

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు, బయట కుక్కచేత భంగపడును, స్థానబలిమిగాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 27

Champadaginayatti shatruvu tanacheta, jikkineni keedu seyaraadu, posaga melu chesi pommanute chalu, Vishwadabhirama! Vinuravema!

చంపదగినయట్టి శత్రువు తనచేత, జిక్కెనేని కీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 28

Panasatonalakanna panchadaaralakanna, juntitenekanna junnukanna, cheruku rasamukanna chelula matele teepi, Vishwadabhirama! Vinuravema!

పనసతొనలకన్న పంచదారలకన్న, జుంటితేనెకన్న జున్నుకన్న, చెఱుకు రసముకన్న చెలుల మాటలె తీపి, విశ్వదాభిరామ వినురవేమ

Read vemana satakam telugu padyam – 29

Miriya ginja chooda meeda nallaganundu, koriki joodalona jukumanunu, sajjanulaguvaari saaramitlundu, Vishwadabhirama! Vinuravema!

మిరియ గింజ చూడ మీద నల్లగనుండు, కొరికి జూడలోన జురుకుమనును, సజ్జను లగు వారి సార మిట్లుండు, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 30

Vampukarragaalchi vampu deerpagavacchu, kondalanni pindi gottavacchu, katinachittu manasu karigimparaadu, Vishwadabhirama! Vinuravema!

వంపుకర్రగాల్చి వంపు దీర్పగవచ్చు, కొండలన్ని పిండి గొట్టవచ్చు, కఠినచిత్తు మనసు కరిగింపగరాదు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Vemana padyalu telugulo 11-20

Read vemana satakam telugu padyam – 11

Dhanamu kudabetti daanambu cheyaka, taanu tinaka lessa daachukonaga, teneteega goorchi teruvarikiyyadaa, Vishwadabhirama! Vinuravema!

ధనము కూడబెట్టి దానంబు చేయక, తాను దినక లెస్స దాచుకొనగ, తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 12

Eluka tolu techchi yedaadi yutikinaa, nalupu nalupekaani telupukaadu, koyyabomma techchi kottite guniyone, Vishwadabhirama! Vinuravema!

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా, నలుపు నలుపేకాని తెలుపుకాదు, కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె, విశ్వదాభిరామ వినురవేమ

Read vemana satakam telugu padyam – 13

Anaga nanaga raaga matisha yilluchunundu, dinaga dinaga vemu tiyyanundu, saadhanamuna panulu samakuru dharalona, Vishwadabhirama! Vinuravema!

అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు, దినగ దినగ వేము తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 14

Antarangamandu naparadhamulu chesi, manchivaanivalenu manujudundu, itarulerugakunna neeshwaruderungudaa, Vishwadabhirama! Vinuravema!

అంతరంగమందు సపరాధములు చేసి, మంచివానివలెను మనుజు డుండు, ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 15

Chittashuddi kaligi chesina punyambu, konchamaina nadiyu goduvugaadu, vittanambu marrivrukshambunaku nenta, Vishwadabhirama! Vinuravema!

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచమైన నదియు గొదవుగాదు, విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 16

Inumu virigeneni irumaaru mummaru, kaachi yatukavacchu kramamugaanu, manasu virigeneni mariyanta nerchunaa, Vishwadabhirama! Vinuravema!

ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు, కాచి యతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరియంట నేర్చునా, విశ్వదాభిరామ! వినురవేమ!

Read vemana satakam telugu padyam – 17

Tappulennuvaaru tandopatandambu, lurvijanulakella nundu tappu, tappulennuvaaru tama tappulerugaru, Vishwadabhirama! Vinuravema!

తప్పు లెన్నువారు తండోప తండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 18

Neetilona vraata niluvakayunnatlu, paati jagatiledu paramuledu, maati maatikella maarunu moorkhundu, Vishwadabhirama! Vinuravema!

నీటిలోన వ్రాత నిలువక యున్నట్లు, పాటి జగతిలేదు పరములేదు, మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 19

Veshabhasha lerigi kaashaayavastramul, gattagane mukti galugabodu, talalu bodulaina talampulu bodulaa, Vishwadabhirama! Vinuravema!

వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్, గట్టగానె ముక్తి గలుగబోదు, తలలు బోడులైన తలంపులు బోడులా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 20

Koti nonaradechchi kotta puttamu gatti, kondamuchchulella golichinatlu, neetiheenunodda nirbhagyudunduta, Vishwadabhirama! Vinuravema!

కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి, కొండముచ్చులెల్ల గొలిచినట్లు, నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట, విశ్వదాభిరామ! వినురవేమ!

Vemana Padyalu Telugulo 1 – 10

Read vemana satakam telugu padyam – 1

Tallitandri meeda dayalen putrudu, Puttanemi vaadu gittanemi, Puttaloni chedalu puttava gittava, Vishwadabhirama vinuravema!

తల్లితండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి? వాడు గిట్టనేమి?, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ

Read vemana satakam telugu padyam – 2

Alpudepudu paluku aadambaramuganu, Sajjanundu paluku challaganu, Kanchu mrogunattu kanakambu mroguna, vishwadabhirama! vinuravema!

అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వ దాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 3

Uppukappurambu nokkapolikanundu, Chooda chooda ruchulu jadaveru, Purushulandu punya purushulu veraya Vishwadabhirama vinuravema!

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 4

Gangigovu paalu garitedainanu chaalu, kadivedainanemi kharamu paalu, bhakti galugu koodu pattedainanu chaalu, Vishwadabhirama! vinuravema!

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు, భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 5

Anuvugaani chota adhikulamanaraadu, konchemundutella koduvakaadu, konda addamandu konchamai yundadaa Vishwadabhirama vinuravema!

అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచమై యుండదా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 6

Verupurugucheri Vrukshambucheruchun, cheeda purugu cheri chettunu cheruchun, Vishwadabhirama vinuravema!

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను, చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ, కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 7

Medipandu chooda melimai yundu, pottavippi chooda purugulundu, birikivani madini binkameelaaguraa Vishwadabhirama vinuravema!

మేడిపండు చూడ మేలిమై యుండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు, బిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వ దాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 8

Nikkamaina manchineela mokkati chaala, taluku beluku raalla tattedela? chaatupadyamulanu chaaladaa okkati, Vishwadabhirama vinuravema!

నిక్క మైన మంచినీల మొక్కటి చాల, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?, చాటుపద్యములను చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ! వినుర వేమ!

Read vemana satakam telugu padyam – 9

Aatma shuddileni yaacharamadiyela, bhaandashuddi leni paakamela, chittashuddileni shivapoojalelaraa, Vishwadabhirama vinuravema!

ఆత్మ శుద్ధి లేని యాచారమదియేల, భాండశుద్ధి లేని పాక మేల, చిత్తశుద్ధిలేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ!

Read vemana satakam telugu padyam – 10

Cheppuloni raayi cheviloni joreega, kantiloni nalusu kaalimullu, intiloniporu intinti kaadaya, Vishwadabhirama vinuravema!

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు కాలిముల్లు, ఇంటిలోనిపోరు నింతింత గాదయా, విశ్వదాభిరామ! వినురవేమ!